గుంటూరు జిల్లా మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీకి చెందిన ఆఫ్రిద్... తన స్నేహితులతో కలిసి పట్టణ శివారులోని సాగర్ మేజర్ కాలువలో ఈతకు వెళ్లాడు. నీళ్లలోకి దిగగా... ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.
గమనించిన స్నేహితులు ఆఫ్రిద్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆఫ్రిద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.