ఎస్సై తనను అనవసరంగా కొట్టాడంటూ ఓ యువకుడు టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి చెందిన గోపి పొలం విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనతో ఎస్సై అసభ్యకరంగా మాట్లాడి....కొట్టాడని ప్యాపిలిలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆప్రాంతంలో దాదాపు గంటపాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉరవకొండ సీఐ వెంకటేశ్వర్లు బాధితుడితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో యువకుడు టవర్ నుంచి కిందకు దిగాడు.
పోలీసులు కొట్టారంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం - ప్యాపిలిలో టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యయత్నం
పోలీసులు అనవసరంగా తనను కొట్టారంటూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ప్యాపిలిలో జరిగింది.
పోలీసులు కొట్టారంటూ టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యయత్నం
ఇదీచూడండి.