ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం' - Tadepalli Latest News

అప్పు వసూళ్ల పేరుతో వేధింపులను తగ్గించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ తరహా ఘటనే జరిగింది.

The victim who took the Money as debt turned to the police station
'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం'

By

Published : Dec 9, 2020, 7:25 PM IST

'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం'

గుంటూరు జిల్లా తాడేపల్లిలో బత్తుల దుర్గ అనే మహిళ వద్ద.. అదే ప్రాంతానికి చెందిన వల్లభనేని భార్గవి అప్పుకింద రూ.2 లక్షలు తీసుకుంది. నెలకు 60 వేల చొప్పున రెండు సంవత్సరాలుగా దాదాపు రూ.14 లక్షలు చెల్లించినా ఇంకా బాకీ ఉన్నారంటూ... దుర్గ వేధింపులకు గురి చేస్తోందని భార్గవి ఆరోపించింది. తమకు రక్షణ కల్పించాలని భార్గవి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు భార్గవి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని బాధితురాలు వాపోయింది. భార్గవి ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details