గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సుగాలి కాలనీ పసుమర్రు ప్రాంతాల్లో నాటుసారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. లాక్ డౌన్ తో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయటం వల్ల కొందరు అక్రమార్కులు ప్రకాశం జిల్లా చీరాల నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు నాటుసారా తీసుకువచ్చి అమ్ముతున్నారు. పసిగట్టిన ఎక్సైజ్ సీఐ నయనతార.. పక్కా నిఘా పెట్టారు. సుగాలి కాలనీలో రమావత్ కోటేశ్వరరావు, పసుమర్రులో కోట కోటేశ్వరరావు అలియాస్ కళ్యాణ్ లను పట్టుకొని అరెస్టు చేశారు. 4 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
చిలకలూరిపేటలో నాటుసారా అమ్మకాలు.. ఇద్దరు అరెస్టు
చిలకలూరిపేట సుగాలి కాలనీ, పసుమర్రు ప్రాంతాల్లో నాటుసారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ సీఐ నయనతార ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు.
నాటుసారా అమ్ముతున్న ఇద్దరు అరెస్టు