ACCIDENT: బండారుపల్లిలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు
10:27 August 28
కాలువ దాటుతున్న సమయంలో ఘటన
గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్లో నలుగురు కూలీలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్.. పొలం పక్కనే ఉన్న కాలువ దాటుతున్న సమయంలో వాహనం టైరు పక్కకు ఒరిగింది. ఒక్కసారిగా కాలువలోకి తిరగబడింది. ఇద్దరు పక్కకు దూకగా.. మరో ఇద్దరు ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండీ..విషాదం: రైలు ఢీకొని ఇద్దరు మృతి