ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీ చోరీ.. - ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీ ఎత్తుకెళ్లిన దుండగుడు
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద నున్న పులిచింతల పునరావాస కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. కాలనీలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీని గుర్తుతెలియని దుండగుడు అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లాడు.
హుండీ ఎత్తుకెళ్లిన దుండగుడు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెంలోని రెడ్డిగూడెం వద్ద నున్న పులిచింతల పునరావాస కాలనీలో అర్ధరాత్రి చోరీ జరిగింది. కాలనీలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నున్న హుండీని గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. హుండీ చోరీ అయినట్లు గమనించిన కాలనీ వాసులు.. ఉదయం రాజుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ELECTION CAMPAIGN: జోరుగా ప్రచారం... ఓట్ల అభ్యర్థనలో ముఖ్య నేతలు