గుంటూరు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13 జిల్లాల్లో ఉన్న వీరాచార, వీరవిద్యావంతులు ఈ నెల 23న కారంపూడి చేరుకుంటారు. సుమారు 35 కొణతాలు ఉత్సవ నిధి మీదకు వచ్చాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వంశపారంపర్యంగా వస్తున్న ఆయుధాలను తమ వెంట తెచ్చుకొని వీరులగుడిలో ఉంచుతారు. 24 ఆయుధాలను బయటకుతీసి నాగులేరు, గంగాధారి మడుగులో శుభ్రపరిచి... వీరతాళ్లు, వీర్ల అంకమ్మ పెట్టెలోని వస్తువులను శుభ్రం చేస్తారు. అనంతరం పల్నాటి వీరచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ చేతుల మీదగా... ఆరాధనతో ఉత్సవాలు మొదలవుతాయి. 25 నుండి 29 వరకు పల్నాటి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పల్నాటి ఉత్సవాలకు దేవాలయాలు ముస్తాబు..! - The temples are statewide for Palnati celebrations in karampudi
గుంటూరు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో దేవాలయాలు ముస్తాబవుతున్నాయి.
పల్నాటి ఉత్సవాలకు ముస్తాబవుతున్న దేవాలయాలు