ఎమ్మెల్యే సీటు కోసం సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ సీఎం జగన్‌కు ఊడిగం చేస్తున్నారని.... తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థే అడ్డదారులు తొక్కుతోందన్నారు. సీఐడీ శాఖని చీఫ్ మినిష్టర్ డిపార్టుమెంటును చేసేశారని.... మండిపడ్డారు.తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిని సంతృప్తి పరచడానికే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆరాటపడుతున్నారని నేతలు ఆరోపించారు.
ఎమ్మెల్యే సీటు కోసమే సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ జగన్‌కు ఊడిగం.. తెదేపా ఎస్సీ నేతల - ఏపీ వార్తలు
TDP SC Leaders Fire: లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థే అడ్డదారులు తొక్కుతూ, రక్షించాల్సిన రక్షకులే శిక్షిస్తున్నారని.. తెదేపా ఎస్సీ నేతలు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సీటు కోసమే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ జగన్ కు ఊగిడం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో దళితులను దారుణంగా హింసిస్తున్నారని.. తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించడం, ఉల్లంఘించడం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఐడీ సునీల్ మానసిక స్థితి సరిగా లేదని.. తెదేపా నేతలే లక్ష్యంగా చేసుకుని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా తెదేపా కార్యకర్తలు, నాయకుల పట్ల ఎలాంటి నోటీసులు లేకుండా కేసులు పెట్టి హింసించడాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: