Supreme Court on SIT GO రాష్ట్ర ప్రభుత్వ సిట్ ఏర్పాటు జీవోలను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశం - SIT GO
11:03 May 03
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
Supreme Court on SIT GO: గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిట్ ఏర్పాటు జీవోలను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవోలు ఇచ్చింది. వీటిపై స్టే విధిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్టేను సవాలు చేస్తూ.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జీవోలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను మెరిట్ ప్రాతిపదికనే కేసు విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సూచించింది. ఆమేరకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి: