ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ కార్డు స్థానంలో... మరో నాలుగు కార్డులకు శ్రీకారం - ఏపీలో ఫీజు రీయంబర్స్​మెంట్ వార్తలు

రేషన్ కార్డు స్థానంలో మరో నాలుగు కార్డులను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. ఫీజు రీయంబర్స్​మెంట్, బియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛను కార్డులను అందించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం

By

Published : Nov 15, 2019, 8:02 AM IST

Updated : Nov 15, 2019, 8:09 AM IST

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు స్థానంలో మరో నాలుగు కార్డులను ఇవ్వనుంది. చౌక దుకాణాల్లో నిత్యవసరాలకు బియ్యం కార్డు, ఉచిత వైద్యసేవల కోసం ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రీయంబర్స్​మెంట్ కార్డు, పింఛను పొందే వారి కోసం పింఛను కార్డులను అందించనుంది. ఈ కార్డులు ఆయా పథకాలకు మాత్రమే ఉపయోగపడతాయి. ఈనెల 20 నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేసి కార్డులు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.ఒకటి, రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం రానుంది.

ఇప్పటిదాకా అన్నిటికీ రేషన్ కార్డే...

⦁ పౌరసరఫరాలశాఖ అందించే రేషన్ కార్డును పలు ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నివాస ధ్రువీకరణకూ ఈ కార్డునే గుర్తింపుగా తీసుకుంటున్నారు. ఇకపై పౌరసరఫరాలశాఖ బియ్యంకార్డునే ఇస్తుంది. దీనిపై బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలు మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది.

⦁ లబ్ధిదారులందరికీ కొత్తగా రేషన్ బియ్యం కార్డు ఇచ్చినా ...ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు రద్దు కాదు. దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఏ శాఖకు ఆ శాఖ...
⦁ ఫీజు రీయంబర్స్​మెంట్, బియ్యం , ఆరోగ్యశ్రీ , పింఛను కార్డులు ఏ శాఖకు ఆ శాఖ ఇస్తుంది.
⦁ అర్హుల గుర్తింపు కోసం ఆయా శాఖలు నిబంధనలు రూపొందించుకుంటాయి.
⦁ కొత్తగా గుర్తించేవారితోపాటు, ఇప్పుడు ప్రయోజనం పొందుతున్న వారికి కూడా ఈ కార్డులను ఇస్తారు.

ఇదీచూడండి.హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా ?

Last Updated : Nov 15, 2019, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details