ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతిచ్చిన తెలగాణ ప్రభుత్వం - 3897 posts in government medical colleges

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాల్లో భారీగా పోస్టుల భర్తీకి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. త్వరలో సామాన్యులందరికీ తెలంగాణలో నాణ్యమైన వైద్యం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతి
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతి

By

Published : Dec 1, 2022, 5:07 PM IST

9 వైద్య కళాశాలల్లో కొలువుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 3,897 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులకు పోస్టులు మంజూరు చేశారు. ఒక్కో కళాశాలకు 433 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌లో వివిధ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులో దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details