ఇదీ చూడండి:
'గుంటూరు ఛానెల్ పనులకు ప్రభుత్వం పచ్చ జెండా' - Guntur channel work latest news
గుంటూరు ఛానెల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 50 గ్రామాల ప్రజలకు గుంటూరు ఛానెల్ చిరకాలపు కల అని చెప్పారు. దాదాపు రూ. 500 కోట్లతో ఛానెల్ ఆధునీకరణ, పర్చూరు వరకు పొడిగింపునకు టెండర్లు పిలిచామన్నారు. ఆధునీకరణ పనులు సుధా ఇన్ఫ్రా గ్రూప్ , పొడిగింపు పనులు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత