ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన 777 గ్రామ పంచాయతీలు, 189 మండల ప్రజాపరిషత్‌లకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ నెల 3వ తేదీలోగా, మండల ప్రజాపరిషత్‌లకు సంబంధించి(ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా) ఈ నెల 4లోగా ఈ జాబితాలను ప్రచురించాలని సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేశ్‌కుమార్ ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు.
'ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి'
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేశ్‌కుమార్ ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు.
The state election commission has directed officials to prepare a list of voters for the newly formed village panchayats and zonal panchayats