రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను "హైందవ ధర్మా శంఖారావం" ఖండించింది. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రంలో జరుగుతున్న శ్రీవిద్యా మహాయాగం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన యాగ పూర్ణాహుతికి రాష్ట్ర నలుమూలల పీఠాధిపతులు హాజరయ్యారు. యాగ కలశాన్ని ఉద్ధండరాయునిపాలెంలో స్థాపించారు. శివక్షేత్రంలో హైందవ ధర్మా శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధితులతోపాటు భాజపా నేతలు, రాజధాని రైతులు, ఐక్యకార్యాచరణ సమితి నాయకులు పాల్గొన్నారు.
దేవాలయాలపై దాడులను ఖండించిన "హైందవ ధర్మా శంఖారావం" - శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తాజా సమాచారం
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను "హైందవ ధర్మా శంఖారావం" ఖండించింది. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రంలో చేపట్టిన శ్రీవిద్యా మహాయాగం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన యాగ పూర్ణాహుతికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, పీఠాధిపతులు కోరారు. పోలీసులు తమ వృత్తి ధర్మాన్ని సరిగా నిర్వహించి ఉంటే.. దేవాలయాలపై దాడులు జరగవని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. సీఎం జగన్ కొంతమంది స్వాములకే సమయం ఇస్తున్నారని.. తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాజధానిలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలోని పీఠాధిపతులంతా అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా కృషి చేయాలని.. రాజధాని పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ కోరారు.
ఇదీ చదవండీ..శంబర పోలమాంబ ఆలయంలో సిరిమానోత్సవం