ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు రోజులుగా పని చేయని సర్వర్... కాకుమానులో ఆగిన రిజిస్ట్రేషన్లు - server problems in kakamanuru

గుంటూరు కాకుమాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పొలాలు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

Sub-Registrar's office
పని చేయని కాకుమాను సబ్ రిజిస్ట్రార్ సర్వర్

By

Published : Dec 18, 2020, 7:11 PM IST

Updated : Dec 18, 2020, 7:33 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రోజుల నుంచి సర్వర్ పని చేయడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారితో నిండి ఉండాల్సిన కార్యాలయం ...సర్వర్ పని చేయకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తుంది. పొలాలు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

రోజూ కార్యాలయం వద్దకు వచ్చి గంటల తరబడి వేచి ఉంటున్నారు. అత్యవసరమైన వారు రాత్రి వరకు అక్కడే వేచి చూస్తూ కూర్చుంటున్నారు. హైదరాబాద్ , మరి కొన్ని దూర ప్రాంతాలలో పిల్లలను వదిలిపెట్టి రిజిస్ట్రేషన్ చేపించేందుకు వచ్చిన వారు... నాలుగు రోజులుగా ఇక్కడే ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సర్వర్ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండీ...తాతయ్య ఇంటికి చేరకుండానే తనువు చాలించిన చిన్నారి

Last Updated : Dec 18, 2020, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details