తనపై కుట్రతోనే తెదేపా అధినేత చంద్రబాబు దాడి చేయించారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రైతుల ముసుగులో తెదేపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడటం దారుణమన్నారు. చంద్రబాబు గత 5 ఏళ్లలో చేసిన తప్పులను తప్పించుకోవటానికి ప్రజా చైతన్యయాత్ర చేపట్టారన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజా చైతన్య యాత్ర ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదన్నారు. 13 జిల్లాల అభ్యున్నతి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
దాడులకు దిగితే ప్రజా చైతన్యయాత్ర ముందుకు సాగదు: రోజా
దాడులకు పాల్పడితే ప్రజా చైతన్య యాత్ర ఒక్క ఇంచు కూడా ముందుకు సాగదని వైకాపా ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. చంద్రబాబు కుట్రతోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు.
ప్రజా చైతన్యయాత్ర ఒక్క ఇంచు కూడా ముందుకు సాగదు