భూముల వర్గీకరణకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అధికారాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్‌లతో పాటు తహసీల్దార్లకు కల్పిస్తున్నట్లు భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ తెలిపారు. రెవెన్యూ రికార్డులో సవరణలు, ఇతర మార్పుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఆయన.... క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుంటూరు గ్రామీణ మండలంలోని ఏటుకూరు గ్రామ సచివాలయాన్ని తొలుత సందర్శించారు. రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ దరఖాస్తు విధానాన్ని పరిశీలించారు.
'ఇకపై తహసీల్దార్లుకు ఆ అధికారం' - power to make changes and additions in the classification of lands rests
భూముల వర్గీకరణ మార్పునకు సంబంధించి సంయుక్త కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాన్ని తహసీల్దార్లకు సైతం కల్పిస్తూ భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ రికార్డులో సవరణలు, ఇతర మార్పుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఆయన.... క్షేత్రస్థాయిలో పరిశీలించారు
తహసీల్దారు కార్యాలయం
అనంతరం గుంటూరు తూర్పు తహసీల్దార్ కార్యాలయంలో వెబ్ ల్యాండ్, మీసేవ, ఏపీ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను గమనించారు. భూముల వర్గీకరణ మార్పునకు సంబంధించి సంయుక్త కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాన్ని తహసీల్దార్లకు సైతం కల్పిస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చదవండి:"ఆలయాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా... జాగ్రత్తలు తీసుకోవాలి"