రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 65వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన దీక్షకు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఇష్టానుసారంగా అమాయకులపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని ఆనంద్ బాబు విమర్శించారు. శాంతియుతంగా పోరాటం చేస్తోన్న వారిపై కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న నియంత పోకడలకు స్వస్తి పలకాలని జీవీ ఆంజనేయులు అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది: నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. ఇష్టానుసారంగా అమాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది