ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న సుమారు 100మంది బీమా మిత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ అభయహస్తం పథకం కింద 12ఏళ్ల నుంచి 1250 మంది 13 జిల్లాలో పని చేస్తున్నామని.. 3వేలు వేతనం, మరో వెయ్యి అదనపు భత్యం కింద చెల్లిస్తామని.. ఉద్యోగంలోకి తీసుకున్నారని మహిళలు చెప్పారు. ఇపుడు బీమా పనిని వాలంటీర్ లకు అప్పగించటం వల్ల తామంతా వీధిన పడ్డామని మహిళలు వాపోయారు. బీమా మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆరోజు సీఎం జగన్ తమకు అభయం ఇచ్చారని గుర్తు చేశారు. నేడు తమను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. 12ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న తమను అకారణంగా తీసేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీమా మిత్రులు నిరసన.. అరెస్ట్ - Insurance allies protest in Thadepalli
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన 100మంది బీమా మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. 12ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న తమను అకారణంగా తీసేశారని బీమా మిత్రులు ఆరోపించారు.
బీమా మిత్రుల నిరసన