ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

man died: అద్దం ముక్క గొంతులో దిగి... వ్యక్తి మృతి - గుంటూరు జిల్లా వార్తలు

లారీలో నుంచి అద్దాలను కిందకు దించుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అద్దం పగిలి.. గొంతులో గుచ్చుకోవటంతో ఓ వ్యక్తి మృతి(man died) చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో(guntur district) జరిగింది.

man died
man died

By

Published : Nov 15, 2021, 7:45 AM IST

గుంటూరు జిల్లా(guntur district) భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామానికి చెందిన తేలప్రోలు వీరవిశ్వేశ్వరరావు (45) వడ్రంగి పనులు చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పంచాయతీ సమీపంలో గల ఓ దుకాణం వద్ద లారీ నుంచి అద్దాలను కిందకు దింపుతున్న సమయంలో.. ప్రమాదవశాత్తు ఓ అద్దం పగిలింది. పగిలిన అద్దం ముక్కల్లో ఒకటి వీరవిశ్వేశ్వరరావు గొంతులో గుచ్చుకుంది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరవిశ్వేశ్వరరావును స్థానికులు ఆసుపత్రికి తరిలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి(man died) చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి

ఈసీజీ పేరుతో యువతిని వివస్త్రను చేసి.. ఫోన్ లో చిత్రీకరిస్తూ..

ABOUT THE AUTHOR

...view details