ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

106వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు - రాజధాని రైతుల ఆందోళనలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన 106వ రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు.

The peasant concerns that continued on the 106th day
106 వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు

By

Published : Apr 1, 2020, 3:09 PM IST

106 వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళన 106వ రోజుకు చేరాయి. ఎవరికి వారే ఇళ్ల వద్దే ఆందోళన చేయాలన్న ఐకాస పిలుపు మేరకు 29 గ్రామాల్లోని రాజధాని వాసులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో రైతులు, మహిళలు పల్లెం, గరిటెల చప్పుడుతో వినూత్నంగా నిరసన చేపట్టారు. తుళ్లూరు, నేలపాడు, అబ్బిరాజుపాలెం, పెదపరిమి, నీరుకొండలో రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొనే వారి కోసం తుళ్లూరులో రైతుల ఆధ్వర్యంలో కుడుతున్న శానిటరీ మాస్కులు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి రైతులకు వీటిని పంపిణీ చేయనున్నారు. కొంత మంది రైతులు స్పచ్ఛందంగా ముందుకొచ్చి మాస్కుల తయారీకి సహాయం చేశారు.

ఇదీ చూడండి:'లాక్​డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావొచ్చు'

ABOUT THE AUTHOR

...view details