గుంటూరు అర్బన్ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని.. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సంవత్సరాంతపు నేరాల నివేదికను విడుదల చేసిన ఆయన.. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నమోదయ్యాయని ఇతర నేర సంఘటనలు తక్కువగానే ఉన్నాయని అన్నారు. మహిళలపై వేధింపుల కేసులు కూడా.. గత సంవత్సరంలో 813 నమోదు కాగా.. ఈ ఏడాది 530 కేసులు నమోదైనట్లు తెలిపారు. గుట్కా, గంజాయి విక్రయాలను అణచివేశామన్నారు. అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించామని ఎస్పీ వివరించారు.
ప్రజల రక్షణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన విజుబుల్ పోలీసింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని.. పెద్ద ఎత్తున మద్యం, ఇసుక రవాణాను నియంత్రించగలిగామని ఎస్పీ వివరించారు. కొత్త ఏడాదిలో కూడా నేరాలను నియంత్రించేందుకు పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.