రక్షణ కల్పించాలని నూతన దంపతులు గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని ఫాతిమాపురంకు చెందిన సాయితేజ... ఫిరంగిపురం రసూల్పేటకు చెందిన మల్లేశ్వరితో ఏడేళ్ళ క్రితం... చదువుకునే రోజుల్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు మేజర్ అయ్యారు. సోమవారం గుంటూరులో ప్రేమ వివాహం చేసుకున్నారు.
'కులాంతర వివాహం చేసుకున్నాం... రక్షణ కల్పించండి' - గుంటూరులో రక్షణ కల్పించాలని నూతన దంపతులు ఫిర్యాదు
బడి వయస్సు నుంచి బాగా పరిచయం. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమకు కులం అడ్డుకాదని పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు చెప్పారు. కానీ వాళ్లు అంగీకరించకపోగా...?
గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
ప్రేమ వివాహం విషయాన్ని పెద్దలకు చెప్పారు. కానీ వారిది కులాంతర వివాహం కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని నూతన దంపతులిద్దరూ... ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు.
ఇదీ చదవండి:భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్