పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కర్షకులు చేస్తున్న ఉద్యమం... 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అన్నదాతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎస్సీ ఐకాస నేతలు వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సీఎం జగన్ వ్యవహరించిన తీరుపై స్కిట్ చేశారు.
జగన్ మాస్క్ ధరించి.. అమరావతి రైతుల వినూత్న నిరసన - అమరావతి తాజా సమాచారం
అమరావతి రైతుల ఉద్యమం 365 రోజులకు చేరువవుతున్న కారణంగా అన్నదాతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ మాస్క్ ధరించి ఓ రైతు ప్రదర్శించిన నాటకం ఉద్యమకారులను ఆకట్టుకుంది.
![జగన్ మాస్క్ ధరించి.. అమరావతి రైతుల వినూత్న నిరసన Amravati farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9897154-141-9897154-1608114197041.jpg)
వినూత్న రీతిలో అమరావతి రైతుల నిరసన