గుంటూరుజిల్లా రేపల్లెలో తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పునరావాస కేంద్రాలలో పర్యటించారు. బాధితులను పరామర్శించి..నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైకాపా నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నివాసానికి ముప్పు తేవాలని కక్షపూరిత ఆలోచనతో వరదను క్రియేట్ చేశారని ఆరోపించారు.జలవనరుల శాఖ మంత్రికి ప్రకాశం బ్యారేజి నీటి సామర్ధ్యంపై కనీస అవగాహన లేదని..వరదను అంచనా వేయలేకపోవడంతోనే లంక ప్రాంతాలన్నీ నీట మునిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంతటి విపత్తు వచ్చినా.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో విదేశీ విహారయాత్రలో ఉండటం బాధాకరమన్నారు. ఎన్నో లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారే గానీ పంట పొలాల సాగుకు నీరు వదలకపోవడం దారుణమన్నారు. వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించి...ముంపు గ్రామాల్లోని ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
వైకాపా బురద రాజకీయాలు చేస్తోంది: అనగాని
వరద ముంపునకు గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ పర్యటించారు. అనంతరం వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
The MLA anagani satyaprasad toured the flood-hit areas inn repalle at guntur district