ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''గ్రామ అభివృద్ధికి ఎన్నారైలు సహాయం చేయండి'' - గ్రామ అభివృద్ధికి ఎన్నారైల సహాయం వార్తలు

దాతల సహకారంతో ముట్లూరులో ఏర్పాటైన మైక్రో వాటర్ ఫిల్టర్ ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

వాటర్ ఫిల్టర్ ని ప్రారంభిస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత

By

Published : Nov 5, 2019, 9:58 AM IST

గ్రామ అభివృద్ధికి ఎన్నారైలు సహాయం చేయండి

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో 12 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తన దృష్టికి తెచ్చారని ఆమె తెలిపారు. దాతల సహకారంతో పాటు తన కార్యాలయం నుంచి కూడా నిధులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ఎన్నారైలు సహాయం చేశారని.. మరింతగా గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని అన్నారు. నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details