ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెవెన్యూ సిబ్బందికి కనీస వసతులు కల్పించాలి' - bopparaju venkateswarlu latest news

రెవెన్యూ శాఖను సాధారణ పరిపాలన శాఖగా గుర్తించాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని భారాన్ని బట్టి రెవెన్యూ సిబ్బందికి కార్యాలయాలను పెంచాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

bopparaju venkateswarlu
బొప్పరాజు వెంకటేశ్వర్లు

By

Published : Aug 30, 2021, 1:15 PM IST

రెవెన్యూశాఖను సాధారణ పరిపాలన శాఖగా గుర్తించాలని, రెవెన్యూ ఉద్యోగుల కోసం ప్రతి సంవత్సరం క్యాలెండర్ పద్ధతిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బొప్పరాజు పాల్గొన్నారు.

పని భారాన్ని బట్టి రెవెన్యూ సిబ్బందికి కార్యాలయాలను పెంచాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. సరిపడా నిధులు సమకూర్చడం ఉద్యోగులకు సృహుద్భావ వాతావరణం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పనుల కోసం రెవెన్యూ అధికారులు తెచ్చిన కోట్ల రూపాయల అప్పులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖను పటిష్ట పరుచుటకు, ప్రజలకు వేగవంతమైన పాలన, సేవలు తక్షణమే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి

NATIONAL SEMINAR: 'రైతుల సమస్యల పరిష్కారానికి.. వాళ్లతోనే కమిటీ వేయాలి'

ABOUT THE AUTHOR

...view details