ఎన్ఎంసీ బిల్లుకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ సభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఐఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు పి. గంగాధరరావు సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం బంద్ గోడ పత్రికను అవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం సూచనలు పట్టించుకోకుండా బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని, బంద్లో ప్రైవేటు, ప్రభుత్వ, కార్పొరేట్, వైద్యశాలల వైద్యులు పాల్గొంటారని అయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా అభ్యంతరాలను స్వీకరించాలని... లేకుంటే అగస్ట్ 15 నుండి ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
రేపటినుండి మెడికోల 24 గంటల బంద్
జాతీయ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా మెడికోలు రేపు ఉదయం నుంచి 24 గంటలపాటు బంద్ నిర్వహించనున్నారు.
The Medicos will be held on 24 hours bandh from tomorrow morning against the NMC bill at guntur district