ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన మేయర్, ఎమ్మెల్యే - today mayor manohar naidu visited vaccination centers news

గుంటూరులోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావాటి మనోహర్ నాయుడు, పరిశీలించారు. ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు.

వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన మేయర్, ఎమ్మెల్యే
వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన మేయర్, ఎమ్మెల్యే

By

Published : May 12, 2021, 4:49 PM IST

గుంటూరులోని వ్యాక్సినేషన్ కేంద్రాలను మేయర్ కావాటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిశీలించారు. నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తెలిపారు. ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులను రాజకీయాలు చేయడం తగదని చెప్పారు.

నగరంలోని ప్రజలు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొదించామని గుంటూరు మేయర్ కావాటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో 10 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తున్నట్టు చెప్పారు. నగరంలో మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details