గుంటూరులో ఐ మనీ సర్వీస్ మొబైల్ యాప్ పేరుతో తమని దలైరాజు వెంకటశివ అనే వ్యక్తి మోసం చేశారని బాధితులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొబైల్, డీటీహెచ్ రీఛార్జులను ఐఎమ్ఎస్ యాప్ ద్వారా చేసుకోవచ్చని.. అందుకు 1 శాతం కమిషన్ వస్తుందని యాప్ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో చాలామంది చిరువ్యాపారులు ఇందులో డీలర్ షిప్ తీసుకున్నారు. వీరి వద్ద మరికొందరు సబ్ డీలర్లుగా చేరారు. అందుకోసం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు చెల్లించినట్లు బాధితులు తెలిపారు. డీలర్లు చెల్లించిన డబ్బు యాప్లో లోడయినట్లు చూపిస్తున్నప్పటికీ.. రీఛార్జ్ చేస్తుంటే పని చేయటం లేదని వాపోయారు. దీంతో బాధితులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.
యాప్ పేరుతో మోసం.. రూ. 50 లక్షలకు పైగా వసూల్..
గుటూరులో ఐఎమ్ఎస్ యాప్ పేరుతో కొంతమందిని మోసం చేసిన వెంకటశివ అనే వ్యక్తి పై నల్లపాడు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. అలాగే గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ యాప్ ద్వారా మొబైల్, డీటీహెచ్ రీఛార్జులను చేసుకోవచ్చని చెప్పడంతో.. ఇందులో డీలర్ షిప్ తీసుకుని మోసపోయామని చిరువ్యాపారులు వాపోయారు.
యాప్ పేరుతో మోసం.. రూ. 50 లక్షలకు పైగా వసూల్..
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోనూ యాప్ ద్యారా మోసపోయిన బాధితులున్నారని పలువురు పేర్కొన్నారు. డీలర్ షిప్ పేరుతో శివ.. రూ. 50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలిపారు. గతంలోనూ అతను ఓ యాప్ పేరుతో మోసానికి పాల్పడ్డారని చెప్పారు. ఆ విషయం దాచిపెట్టి సబ్ డీలర్లుగా తమ నుంచి డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్థంతి