ఉద్యోగం పోతుందనే భయంతో వ్యక్తి మృతి - job
తనకు జీవనాధారమైన ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో అతను తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చివరకి గుండెపోటుతో మృతి చెందాడు.
ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న భయంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడు గుండెపోటుతో చనిపోయాడు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మురళి అనే వ్యక్తి ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడిగా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు మురళి స్థానంలో..మరొకరికి నియమిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే లేఖ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగం పోతోందన్న భయంతో ఆందోళనకు గురైన మురళి గుండెపోటుకు గురయ్యాడు. చికిత్స కోసం గుంటూరు తీసుకువెళ్తున్న సమయంలో మృతి చెందినట్లు అతని భార్య ప్రశాంతి తెలిపారు