ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసియా, ఆఫ్రికా చిరుతలది ఒకే జాతి కాదు

ఆసియా, ఆఫ్రికా చిరుతలది ఒకే జాతి కాదని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధనలో పేర్కొంది. రెండింటిదీ ప్రత్యేక జన్యు నిర్మాణం కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది.

latest research by ccmb asian and african cheetahs are not same species
ఆసియా, ఆఫ్రికా చిరుతలది ఒకే జాతి కాదు

By

Published : Mar 18, 2020, 12:01 PM IST

ఆసియా చిరుతపులులు ప్రత్యేక జన్యు నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధన ధ్రువీకరించింది. ఆసియా, ఆఫ్రికా చిరుతలు దాదాపు 50 నుంచి లక్ష సంవత్సరాల మధ్య వేరుపడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా చిరుతల జన్యు నిర్మాణం చాలా భిన్నంగా ఉందని పరిశోధన ఫలితాలు ధ్రువీకరిస్తుండటం వల్ల చిరుతలు దేశంలో అంతరించిపోకుండా ప్రయత్నాలు కొనసాగించాలని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు.

దేశంలో చిరుతలకు ముప్పు పొంచి ఉండటం వల్ల ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో ఉన్న చిరుతలను మన అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి గతంలో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికా చిరుతలలో ఉండే భేదాలను గుర్తించేందుకు సీసీఎంబీ, లక్నోలో బీర్బల్‌ సహాని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియో సైన్సెస్‌, కోల్‌కతాలోని జంతు సర్వే సంస్థ, యూకేకు చెందిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధనలు నిర్వహించాయి.

ఆసియా, ఆఫ్రికా చిరుతల పరిణామ చరిత్ర తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా రెండు జాతులు భిన్నమైనవని గుర్తించారు. సీసీఎంబీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ పరిశోధన గురించి వివరించారు. ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాల్లోని చిరుతలు, ఆగ్నేయ ఆఫ్రికా చిరుతలు దాదాపు 100-2 లక్షల సంవత్సరాల క్రితం వేరుపడ్డాయని పరిశోధనల ద్వారా గుర్తించామన్నారు. ఈ విశ్లేషణతో ఆఫ్రికా, ఆసియా చిరుతలు 50-లక్ష సంవత్సరాల మధ్య వేరుపడ్డాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారన్నారు. ఇంతవరకు భావిస్తున్నట్లుగా ఆసియా, ఆఫ్రికా చిరుతలు 5 వేల సంవత్సరాల క్రితం పరిణామ విభజన చెందాయనే సిద్ధాంతానికి భిన్నంగా ఈ ఫలితాలు ఉన్నాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ జాకబ్స్‌ తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాను లెక్కచేయకుండా రోడ్డెక్కిన 'షాహీన్​బాగ్'​ నిరసనకారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details