ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం'

సినీ రంగంలో రారాజుగా వెలిగొంది.. రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. పేదవాడి ఆకలి తీర్చటానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.

NTR Jayanti Celebrations
ఎన్టీఆర్ జయంతి వేడుకలు

By

Published : May 28, 2021, 1:20 PM IST

గుంటూరు తెదేపా జిల్లా కార్యాలయంలో దివంగత నేత స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అధికారంలో ఉన్న లేకపోయినా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని నక్కా స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పక్కనపెట్టి కక్షసాధింపు చర్యలకు పాలపడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ చర్యలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

తెలుగువారి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని మాజీ మంత్రి ఆలపాటి కొనియాడారు. రాజకీయాలకు కొత్త అర్థాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడని...పేదవాడి ఆకలి తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చి అందరికి మార్గదర్శి అయ్యారన్నారు. నేడు మహానాడు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.

ఇదీ చదవండీ.. House arrest: వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గృహనిర్బంధం

ABOUT THE AUTHOR

...view details