వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా న్యాయస్థానాల నుంచి వస్తున్న వరుస తీర్పులు ముఖ్యమంత్రి జగన్‌కు గుణపాఠం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రాజధాని అమరావతిలో బయట వ్యక్తులకు ఇళ్లస్థలాలు ఇవ్వటంపై హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. రాజధాని రైతుల త్యాగాలను అవమానపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ భవనాలకు మూడు రంగులపై సుప్రీం ఆదేశాలను ఆయన ప్రస్తావించారు. కరోనా మూడు వారాలపాటు రాదని, ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు.
'న్యాయస్థానాల తీర్పులు సీఎం జగన్‌కు గుణపాఠం కావాలి' - జగన్ పై ముప్పాళ్ల నాగేశ్వరావు విమర్శలు
ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వస్తున్న న్యాయస్థానాల తీర్పులను చూసైనా ముఖ్యమంత్రి జగన్ గుణపాఠం నేర్చుకోవాలని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. కరోనా విజృంభిస్తున్నా.. ఎన్నికలు నిర్వహించాలన్న సీఎస్ పై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరావు