గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 237కు చేరింది. ఇవాళ కొత్తగా 23 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి గుంటూరు నగరంలో 134, నర్సరావుపేటలో 64కు చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది మృతిచెందగా... 29 మందికి వ్యాధి నయమైంది. ఇంకా 200 మంది బాధితులు గుంటూరు ఐడీ ఆసుపత్రి, ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు, నర్సరావుపేటను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. ఈ రెండు చోట్లా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.