పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 257వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు దీక్షా శిబిరాలలో ఆందోళనలు కొనసాగించారు. 257రోజులైనా.....రైతులు, మహిళలు భారీగా దీక్షా శిబిరాలలో పాల్గొంటున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, అబ్బిరాజుపాలెం, తుళ్లూరు, మందడం, పెనుమాకలో అమరావతికి మద్దతుగా దీక్షా శిబిరాలలో మహిళలు నినాదాలు చేశారు. అబ్బిరాజుపాలెంలో మహిళలు పోలేరమ్మకు పొంగళ్లు పెట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మహిళలు ప్రార్థించారు.
257వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల దీక్షలు - రాజధాని రైతుల వార్తలు
అమరావతినే పరిపాలన రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 257వ రోజూ కొనసాగాయి. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు దీక్షా శిబిరాలలో ఆందోళనలు కొనసాగించారు.
257వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల దీక్షలు