గుంటూరు జిల్లా నరసరావుపేటలోని డిట్కో హౌస్ల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో పట్టణంలోని సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నరసరావుపేటలోని పనసతోటకు చెందిన కొటారి సాయి కిరణ్, గుంటూరు పట్టాభిపురానికి చెందిన పులి రమేష్ అనే ఇద్దరు ఖైదీలు గత కొన్ని రోజుల కిందట కరోనా సోకి ప్రభుత్వ కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సెక్యూరిటీ కళ్ళు గప్పి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసరావుపేట గ్రామీణ సీఐ వై. అచ్చయ్య తెలిపారు.
కొవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీల పరార్ - నరసరావుపేట వార్తలు
కొవిడ్ కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
![కొవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీల పరార్ two prisoners escaped from the Kovid center in narasaraopeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8648360-78-8648360-1599032589677.jpg)
కొవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీల పరార్