గుంటూరు జిల్లాలో గుర్తుతెలియని రోగంతో పశువులు మృత్యువాతపడడం కలకలం రేపింది. అచ్చంపేట మండలం మాదిపాడు పంచాయతీ పరిధిలోని గింజుపల్లి తాండాలో పశువులకు వింత జబ్బు సోకింది. చర్మం ఎర్రగా కమిలిపోయి పాడి పశువులు చనిపోతున్నాయి. ఈ రెండు రోజుల్లోనే ఐదు గేదెలు ఈ విధంగా మృత్యువాత పడ్డాయి.
అంతుచిక్కని వ్యాధితో పశువులు మృతి - అంతుచిక్కని రోగంతో గుంటూరులో పశువులు మృతి
అంతుచిక్కని జబ్బుతో పశువులు మృత్యువాత పడుతున్న సంఘటన గుంటూరు జిల్లా మాదిపాడు పంచాయతీ పరిధిలోని గింజుపల్లి తండాలో చోటుచేసుకుంది.
![అంతుచిక్కని వ్యాధితో పశువులు మృతి The incident in which cattle died due to a mysterious disease took place in Ginjupalli Tanda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8548631-936-8548631-1598341794633.jpg)
మాదిపాడు పంచాయతీ పరిధిలో మరో 10 పశువులకు ఈ రోగం సోకింది. దీంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని పశుసంవర్థక శాఖ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు మాదిపాడులో పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగం వచ్చిన పశువులతో పాటు మిగతా పశువుల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తలంబ్రాల చెట్టు ఆకు తినటం వల్ల ఇలాంటి రోగం వస్తుందని పశువైద్యులు చెబుతున్నారు. గేదెల్ని బయటకు వెళ్లనీయకుండా నీడలో ఉండేలా చూడాలని గ్రామస్థులకు సూచించారు.
ఇవీ చదవండి:కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు