ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మానవ హక్కుల కమిషన్​కు రాష్ట్రంలో కార్యాలయం ఏదీ..?' - AP HRC News

రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్​కు కార్యాలయం కేటాయించకపోవటాన్ని.. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం తప్పుబట్టింది. ఇటీవలే కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా కార్యాలయం కేటాయించలేదు. ఇది కూడా మానవ హక్కులకు ఇబ్బంది కల్గించే చర్యగా పౌరహక్కుల సంఘం కార్యదర్శి పొత్తూరి సురేష్ అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలు తమ హక్కులకు భంగం కలిగితే ఫిర్యాదు స్వీకరించేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవటం.. న్యాయాన్ని అందుబాటులో లేకుండా చేయటమేనన్నారు. వేలాది పిటిషన్లు ఇప్పటికే కమిషన్ వద్ద పెండింగ్​లో ఉన్నాయని... అందుకే హైదరాబాద్​లో గానీ, ఏపీలో గానీ మానవ హక్కుల కమిషన్​కు కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

'మానవ హక్కుల కమిషన్​కు రాష్ట్రంలో కార్యాలయం ఏదీ..?'
'మానవ హక్కుల కమిషన్​కు రాష్ట్రంలో కార్యాలయం ఏదీ..?'

By

Published : Apr 2, 2021, 7:41 PM IST

పొత్తూరి సురేష్

ABOUT THE AUTHOR

...view details