ఈఎస్ఐ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న ఇద్దరి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని రవితేజశ్రీ, యశస్వి లను ఏ9, ఏ10 నిందితులుగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దీంతో ఇద్దరు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం దరఖాస్తులను కొట్టేస్తూ ఈ రోజు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈఎస్ఐ కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న పితాని వెంకట సురేష్, మురళీ మోహన్ ల ముందస్తు బెయిల్ ను కొట్టేసిన విషయం తెలిసిందే.
ఈఎస్ఐ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు - ఈఎస్ఐ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని రవితేజశ్రీ ,యశస్విలను ఏ9, ఏ10 నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న వీరిద్దరి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
The High Court