High Court on rowdy sheet : ఒక వ్యక్తిపై కేసులు పెండింగ్‌లో లేనప్పుడు, అతని చర్యలు ప్రజాప్రయోజనాలకు విఘాతం కానప్పుడు రౌడీషీట్ కొనసాగించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఓ వ్యక్తి విషయంలో ఉన్న ఒక్క కేసులోనూ న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించాక పోలీసులు రౌడిషీట్ కొనసాగించడాన్ని తప్పుపట్టింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్‌పై షీట్ మూసేయాలని మంగళగిరి పోలీసులను ఆదేశించారు.
కేసు పెండింగ్‌లో లేనప్పుడు రౌడీషీట్ కొనసాగింపు సరికాదు: హైకోర్టు - హైకోర్టు వార్తలు
High Court on rowdy sheet : ఒక వ్యక్తిపై కేసులు పెండింగ్‌లో లేనప్పుడు అతడిపై రౌడీషీట్ కొనసాగించటం సరికాదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. తనపై రౌడిషీట్ మూసేలా ఆదేశించాలని కోరుతూ చినకాకానికి చెందిన మర్రి గోపి హైకోర్టును ఆశ్రయించారు.
తనపై రౌడిషీట్ మూసేలా ఆదేశించాలని కోరుతూ చినకాకానికి చెందిన మర్రి గోపి హైకోర్టును ఆశ్రయించారు. 2011లో హత్యానేరం అభియోగంతో పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని, 2014 లో దిగువ న్యాయస్థానం దానిని కొట్టేసిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఏ కేసు పెండింగ్ లేదన్నారు. పోలీసులు షీట్‌ను కొనసాగిస్తున్నారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. పిటిషనర్ నిర్దోషని తేలాక, మరే ఇతర కేసులు పెండింగ్‌లో లేనప్పుడు షీట్ కొనసాగింపు పోలీసు స్టాండింగ్ అర్డర్స్‌కు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి