ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2022, 5:36 AM IST

ETV Bharat / state

'ఆ ఆలయ భూమిపై మూడోపక్షానికి హక్కులు కల్పించొద్దు'

గుంటూరులోని కామాక్షి-ఏకాంబరేశ్వర స్వామి ఆలయ భూమిపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. అధికారుల అండతో నిరభ్యంతర పత్రం పొంది కోట్లాది రూపాయల విలువైన భూమిని కైంకర్యం చేసేందుకు సిద్ధమయ్యారు. భక్తులు కోర్టుని ఆశ్రయించడంతో..ఆలయానికి సంబంధించిన భూమిపై మూడోపక్షానికి హక్కులు కల్పించొద్దని దేవాదాయశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

కామాక్షి-ఏకాంబరేశ్వర స్వామి ఆలయం
కామాక్షి-ఏకాంబరేశ్వర స్వామి ఆలయం

పాతగుంటూరులోని కంచి కామాక్షి-ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన భూమిపై మూడోపక్షానికి హక్కులు కల్పించొద్దని... దేవాదాయశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సుద్దపల్లి దొంక సమీపంలో ఆలయానికి రెండెకరాల భూమి ఉంది. 1914లో దాతలు వీలునామా ద్వారా... ఆ భూమిని ఆలయానికి కేటాయించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ చేయాలని కోరారు. అప్పటి నుంచి భూమి విరాళం ఇచ్చిన దాతలు, ఆలయ అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. దేవాదాయ భూములు 2018లో నిషేధిత జాబితాలో పెట్టే క్రమంలో.. రెండెకరాల భూమిని సైతం చేర్చారు.

'ఆ ఆలయ భూమిపై మూడోపక్షానికి హక్కులు కల్పించొద్దు'

అత్యంత విలువైన భూమి కావడంతో.. కాలక్రమేనా అక్రమార్కులు కన్నేసి.. ఆ భూమి తమదేనంటూ... 2018లో కొందరు తెరపైకి వచ్చారు. దీనికి తోడు 2022లో.. సదరు భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదేనంటూ దేవాదాయశాఖ నిరభ్యంతర పత్రం సైతం జారీ చేసింది. నిరభ్యంతర పత్రం తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు భక్తులు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆదేశాలు ఉన్నంత వరకు భూమిని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదని తెలిపింది.

ఆలయ భూమిని ఇతరులకు ఎలా కట్టబెడతారని భక్తులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా ఆలయం కింద ఉన్న భూమి పరాధీనమైతే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో ఆలయభూమికి ప్రస్తుతానికైతే రక్షణ లభించినట్లయింది.

ఇదీ చదవండి:sajjala: "వచ్చే ఎన్నికల్లో పొత్తులపై... ఎలాంటి చర్చ జరగలేదు"

ABOUT THE AUTHOR

...view details