గుంటూరు జిల్లా బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. గతంలో పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని తెలంగాణాకు కేటాయించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కోసం రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ 2015 ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇన్నాళ్లూ విశ్రాంత అధికారులకే బాధ్యతలు
మొదట్లో కృష్ణా జిల్లా నూజివీడులోని భవనాల్లో కొంతకాలం ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహించారు. ఆ తర్వాత బాపట్లలోని పంచాయతిరాజ్ శిక్షణా కేంద్రంలోనే..... ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ 60 ఎకరాల్లకు పైగా శిక్షణా కేంద్రంఉండగా.. 2016 జూన్ లో ఇక్కడి నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. గతంలో ఉన్న భవనాలతో పాటు మరో రూ. 8 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొత్త భవనాలు నిర్మించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి తొలి డైరక్టర్ జనరల్ గా పనిచేశారు.