కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తుంటే.. మంత్రులు మాత్రం స్థానిక ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులపై సుప్రీం ఆదేశాలను అలపాటి ప్రస్తావించారు. సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై న్యాయస్ధానాలు అక్షింతలు వేస్తున్నాయని...కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా జగన్‌లో చలనం లేదన్నారు. కరోనా వైరస్‌పై ప్రభుత్వం వద్ద స్పష్టమైన విధానం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కరోనా ప్రభావంతో పనులు లేని కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయం చేయలన్నారు.
'కరోనా వైరస్ నివారణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' - జగన్ పై ఆలపాటి విమర్శలు
కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన విధానం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. వైరస్ కరాళ నృత్యం చేస్తుంటే.. మంత్రులు మాత్రం స్థానిక ఎన్నికలు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్