ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతలకు భారీ వరద. 14 గేట్లు ఎత్తివేత - guntur news

ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న కారణంగా. గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు 14 గేట్లు 3 మీటర్ల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు.

the-floodwaters-continue-to-flow-into-the-pulichintala-reservoir
పులిచింతలకు కొనసాగుతున్న ప్రవాహం

By

Published : Sep 15, 2020, 10:32 AM IST

Updated : Oct 17, 2022, 3:14 PM IST

గుంటూరు జిల్లాలోని పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.68 లక్షల క్యూసెక్కులు కాగా....అవుట్ ఫ్లో 3.53 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 14 గేట్లు 3 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 15 వేల క్యూసెక్కులు విద్యుత్ ఉత్పాదన కోసం వదులుతున్నారు.

పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా... జలాశయం ప్రస్తుత నీటిమట్టం 174.30 అడుగులగా ఉంది. ఆనకట్ట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు ఉండగా.... ప్రస్తుత నీటి నిల్వ 44.69 టీఎంసీలుగా ఉంది.

Last Updated : Oct 17, 2022, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details