కరోనాతో చనిపోయిన వారికి అయిన వారు దూరంగా ఉండిపోతున్న తరుణంలో ఓ కుటుంబ సభ్యులు.. తామే అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఓ వ్యక్తి శ్వాస సమస్యతో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిక్షించి కొవిడ్ లక్షణాలున్నాయని చెప్పడంతో... ఆయనను జీజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయాడు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించినా.. ఇంకా నివేదిక రాలేదు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వచ్చి.... అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమం పూర్తి చేశారు. అంత్యక్రియల్లో కొందరు గ్రామస్థులు సైతం పాల్గొన్నారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కొవిడ్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తికి కుటుంబసభ్యుల అంత్యక్రియలు - covid deadbodies news
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో సొంతవారు ఎవరైనా మరణిస్తే అయినవారే దూరంగా ఉండిపోతున్నారు. అంత్యక్రియలు కూడా ప్రభుత్వ సిబ్బందే నిర్వహించడం మనం చూస్తున్నాం. తమను కని పెంచిన తండ్రి కరోనా లక్షణాలతో చనిపోతే.. ఆయన్ను గౌరవంగా చివరి మజిలీకి పంపడం బాధ్యతగా భావించారు ఆ కుమారులు. వైద్యుల సూచన మేరకు పీపీఈ కిట్లు ధరించి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగిన ఘటన వివరాలివి..!
కొవిడ్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తికి కుటుంబసభ్యుల అంత్యక్రియలు