గుంటూరు జిల్లా యడ్లపాడులోని కొండపై పవిత్రంగా భావించే సీతమ్మ పాదాలు, నరసింహస్వామి విగ్రహం ఉన్నచోట అన్యమతస్థులు నిర్మించిన.. శిలువను తొలగించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రార్థనలు చేసుకుంటూ ఇప్పుడు కాంక్రీటుతో మెట్లు నిర్మించుకుని.. పెద్ద శిలువను నిర్మించారన్నారు. సామాన్య మానవుడు నిలువనీడలేక చిన్న స్థలం ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటే వెంటనే కూల్చివేసే రెవెన్యూ యంత్రాంగం.. కొండపై అక్రమంగా నిర్మించిన శిలువను తొలగించాలన్నారు. దీనిపై జేసీ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందించినట్లు రామకృష్ణ తెలిపారు.
'యడ్లపాడు కొండపై నిర్మించిన శిలువను తొలగించాలి'
గుంటూరు జిల్లా యడ్లపాడులోని కొండపై అన్యమతస్థులు నిర్మించిన శిలువను తొలగించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు.
'అన్యమతస్థులు నిర్మించిన శిలువను కూల్చివేయాలి'