నెల చివర్లో ఇస్తానని చెప్పి
ఆప్యాయంగా పలకరించారు.... అప్పులు చేసి పరారయ్యారు! - గుంటూరులో దంపతుల ఘరానా మోసం వార్తలు
ఇరుగుపొరుగువారిని ఎంతో అప్యాయంగా వరసలు కలిపి పలకరించేవారు ఆ దంపతులు. బంధువులు, తెలిసినవారి దగ్గర మంచివారని పేరు తెచ్చుకున్నారు. అదే ముసుగులో 25 మంది దగ్గర కోట్ల రూపాయలను తీసుకుని ఉడాయించారు. గుంటూరులో జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగుచూసింది.
దంపతుల ఘరానా మోసం
కొన్నాళ్లకు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలంటూ వెంకటేష్‌ని అడగగా... ఇదిగో అదిగో అంటూ ఇంటి చుట్టూ తిప్పించుకున్నాడని బాధితులు అంటున్నారు. అక్టోబర్ నెల చివర్లో కచ్చితంగా ఇస్తామని చెప్పాడని.. తీరా గత నెల 28న ఇంటి నుంచి పరారయ్యాడని చెబుతున్నారు. దంపతులను పట్టుకోవాలని బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తిరిగొచ్చేలా చూడాలని కోరారు.