Bodies Reached Hometown: అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో సరస్సులో పడి గత నెల 26న మృతి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతుల మృతదేహాలు.. స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చేరుకున్నాయి. ఇద్దరు పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లిన వీరు.. ప్రమాదవశాత్తూ సరస్సులో పడి మృతి చెందారు. నారాయణ, హరిత దంపతులు, ఇద్దరు కుమార్తెలను పాలపర్రుకు తీసుకొచ్చారు. దంపతుల మరణం కుటుంబసభ్యులను తీవ్రంగా కలచివేసింది. నారాయణ, హరితలను చివరి చూపు చూసేందుకు బంధువులు, గ్రామస్థులు తరలివచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతోపాటు.. పలువురు ప్రముఖులు సందర్శించి.. నివాళులు అర్పించనున్నారు.
అమెరికాలో మరణించిన దంపతులకు.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు - గుంటూరు జిల్లా వాసులు అమెరికాలో మృతి
Bodies Reached Hometown: అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ప్రమాదవశాత్తూ.. సరస్సులో పడి మృతి చెందిన దంపతుల మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. వీరి అంత్యక్రియలు నేడు స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో నిర్వహించనున్నారు. దంపతుల ఇద్దరూ ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
అమెరికాలో మరణించిన దంపతులు