గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమందల గ్రామంలో 40 క్వింటాళ్ల మిరపకాయలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామానికి చెందిన గుత్తా హనుమంతరావు, గుత్తా వాసు అనే రైతులకు చెందిన 40 క్వింటాళ్ల మిరపకాయలను ఆరుబయట ఆరబోసారు. శనివారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మిరపకాయలకు నిప్పంటించారు. మంటలను గుర్తించిన స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. మిరపకాయలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 6 లక్షలు విలువ చేసే పంటను కోల్పోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మిరప పంటను దహనం చేసిన దుండగులు - గుంటూరు జిల్లాలో మిరప పంటను తలగలపెట్టిన దుండగులు
మనుషుల మీద కోపమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. 40 క్వింటాళ్ల మిరకాయలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. చేతికొచ్చిన పంట బూడిదపాలు కావటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
the chili crop burned by unknown people at Yalamandala in guntur district